మేము మీకు తెలుసా.?

కెట్.. ఈ పదం మన కళ్లకు కనిపించినా.. చెవులకు వినిపించినా.. వెంటనే ప్రతిస్పందిస్తాం. అంతెందుకు చిన్నపిల్లాడిని కదిపి.. మనకు చివరిసారిగా ప్రపంచకప్ ఎప్పుడు వచ్చింది.? అని అడిగితే వెంటనే 2011 అని సమాధానం చెప్తాడు. కానీ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్పా.. క్రికెట్‌ ప్రపంచకప్పా అని అడగడు. క్రికెట్‌ అని మనం ప్రస్తావించకపోయినా.. వాళ్లు చెప్పేది క్రికెట్‌ గురించే.. మిగిలిన క్రీడల కంటే ఎక్కువగా క్రికెట్‌ మనతో పెనవేసుకుంది. క్రికెట్‌ అంటే తెలియని వాళ్లు సైతం భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌ వస్తుందంటే చాలు కోహ్లీ ఎంత కొట్టాడు.? అని అడుగుతారు. భారత్‌లో ఉన్నంత మంది క్రికెట్‌ అభిమానులు మారెక్కడా ఉండదనేది జగమెరిగిన సత్యం. మరి అలాంటి క్రికెట్‌లో మనకు తెలియని విశేషాలెన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని మీకోసం..