‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లేటస్ట్‌ అప్‌డేట్‌..!

హైదరాబాద్‌: దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్ టైటిల్‌) నుంచి లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందిస్తున్నారట. ఈ విషయాన్ని సినిమాకు సంగీతం అందిస్తున్న ఎంఎం కీరవాణి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలోని పాటలకు సుద్దాల అశోక్‌ తేజ లిరిక్స్‌ రాయడం మొదలుపెట్టారు. ఆయన అద్భుతంగా, వేగంగా పని పూర్తిచేస్తున్నారు’ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వద్ద ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగున్నట్లు కీరవాణి గతంలో వెల్లడించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం జక్కన్న ప్రెస్‌మీట్‌ పెట్టి సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.