18వ శతాబ్దపు ఓ ‘మై లవ్లీ లలన...’

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు తెలుగు సినిమా పాటలంటే ఎంతో శ్రావ్యంగా మృదుమధురంగా ఉండేవి.. కానీ, ఆ తర్వాత కొంతకాలం.. కాస్త పక్కదోవ పట్టినా, మళ్లీ నేటి యువ దర్శకులు కొందరు ఆనాటి పాటలకు సరికొత్త సొబగులు అద్దుతున్నారు. అందుకే శ్రవణానందమైన పాటలకు యువత ఫిదా అయిపోతోంది. తెలుగు సినిమా పాటల్లో జానపదాలు.. కృతులు.. జావళిలు.. వచ్చి చేరుతున్నాయి. ‘అజ్ఞాతవాసి’లో ‘మధురాపురి సదనా మృదు వదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా’ పాట ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే. ఇటీవల మరో పాట కూడా యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు తెలుగు సినిమా పాటలంటే ఎంతో శ్రావ్యంగా మృదుమధురంగా ఉండేవి.. కానీ, ఆ తర్వాత కొంతకాలం.. కాస్త పక్కదోవ పట్టినా, మళ్లీ నేటి యువ దర్శకులు కొందరు ఆనాటి పాటలకు సరికొత్త సొబగులు అద్దుతున్నారు. అందుకే శ్రవణానందమైన పాటలకు యువత ఫిదా అయిపోతోంది. తెలుగు సినిమా పాటల్లో  జానపదాలు..  కృతులు.. జావళిలు.. వచ్చి చేరుతున్నాయి. ‘అజ్ఞాతవాసి’లో  ‘మధురాపురి సదనా మృదు వదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా’ పాట ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే. ఇటీవల మరో పాట కూడా యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.


హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్‌-సాయిపల్లవి జంటగా  నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, విశాల్‌ శేఖర్‌ సంగీతం అందించిన పాటలు శ్రోతలను విశేషంగా  అలరించాయి. ముఖ్యంగా ‘ఓ మై లవ్లీ లలన’ పాట యువతకు బాగా నచ్చింది. అయితే, ఈ పాట ఇప్పటిది కాదు.. 18వ శతాబ్దం మొదట్లో కరూర్‌ శివరామయ్య తెలుగు, ఇంగ్లీష్‌ పదాలను ఉపయోగించి దీన్ని రచించారు. కర్ణాటక సంగీతంలోని ఖరహరప్రియ రాగములో దీన్ని స్వరపరిచారు. తమిళ, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్‌ పదాలను కూర్చి ఇలాంటి  జావళీలను ఎన్నో ఆయన స్వరపరిచారు. ఇంగ్లీష్‌ పదాలతో స్వరపరిచిన ఈ జావళీలు ఆంగ్లేయులు సైతం తెగ ఇష్టపడేవారట. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఈ జావళి అలరిస్తోంది. కర్ణాటక సంగీతంలో మైసూర్‌ వడయార్స్‌ డాక్టర్‌ శ్రీకాంతం నాగేంద్ర శాస్త్రి ఆలపించిన జావళిని, సినిమాలోని పాట మీరూ వినేయండి..!